Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారితోషికంగా ఎన్టీఆర్ 75 వేలు తీసుకునేటప్పుడు, రాజబాబు పారితోషికం 60 వేలు ఉండేది: దర్శకుడు సాగర్

  • రాజబాబు సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు 
  • నటుడిగా ఎదుగుతూ వెళ్లాడు 
  • సాయం అడిగితే వెంటనే చేసేవాడు 
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సాగర్ మాట్లాడుతూ, రాజబాబును గురించి ప్రస్తావించారు. "రాజబాబు చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు. అప్పట్లో ఆయన మా అమ్మమ్మ దగ్గర నాలుగు రూపాయలు అప్పుగా తీసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి రాజబాబు నటుడిగా ఎదుగుతూ వెళ్లాడు. ఎన్టీఆర్ 75 వేలు పారితోషికం తీసుకునే రోజుల్లో రాజబాబు 60 వేలు తీసుకునేవాడు. దానిని బట్టి రాజబాబు ఏ రేంజ్ కి వెళ్లాడో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి రాజబాబు కష్టాల్లో నుంచి రావడం వలన జాలి గుణం ఎక్కువగా వుండేది. ఎవరేది చెప్పినా నమ్మేసి సాయం చేసేవాడు. డబ్బులు ఇచ్చే విషయంలో ఆయన ఎంతమాత్రం ఆలోచించేవాడు కాదు. ఒకసారి తెనాలిలో ఏర్పాటు చేసిన ఒక ఫంక్షన్ కి రాజబాబు రావలసి వుంది. ఆయనను వెంటబెట్టుకుని వెళ్లడానికి నేను రాజబాబు దగ్గరికి వెళ్లాను. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన వాళ్లకి నేను రావడం వలన ఎంత మిగులుతుంది? .. ఒక పదివేలు మిగలొచ్చు అంతేగా. ఆ పదివేలు తీసుకెళ్లి వాళ్లకి ఇచ్చేయి .. నేను రాలేను .. నన్ను వదిలేయి" అని చెప్పేసి పది వేలు ఇచ్చేశాడు" అంటూ చెప్పుకొచ్చారు.
sagar
rajababu

More Telugu News